| Daily భారత్
Logo




మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

News

Posted on 2026-02-10 18:50:29

Share: Share


మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

స్పీడ్ బ్రేకర్లు, మోరీలు లేక నిత్యం రోడ్డు ప్రమాదాలు

తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల డిమాండ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం మండలం మల్లెల మడుగు మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి (ఆర్‌అండ్‌బీ రోడ్డు)పై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మల్లెల మడుగు సరిహద్దులోని సర్గం పాలన చింత చెట్టు వద్ద ప్రమాదాల తీవ్రత అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అలాగే కలవట్ల వద్ద మోరీలు లేకపోవడం వల్ల వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ప్రతి రోజూ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అంటున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, మోరీలు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు

Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >