| Daily భారత్
Logo




తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

News

Posted on 2026-02-10 20:22:53

Share: Share


తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ, నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయాలని యత్నించిన నలుగురు నిందితులను  పోలీసులు అరెస్టు చేశారుచంద్రుగొండ సెంటర్ విజయవాడ-కొత్తగూడెం ప్రధాన రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా,  వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద రూ.500/- విలువైన నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని విచారణ చేయగా నిందితులు గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది.విచారణలో బయటపడిన వివరాల ప్రకారం నిందితులు  తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి ఇనుప బీరువాలు పగలగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను దొంగతనం చేశారు.దొంగతనాల ద్వారా పొందిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బులతో హైదరాబాద్ నుండి నకిలీ ₹500 రూపాయల నోట్లను కొనుగోలు చేసి వాటిని కొత్తగూడెం, చంద్రుగొండ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు ప్రాంతాలలోని పాపుల్లో చలామణి చేసి అసలు నోట్లుగా మార్చి ప్రజలను మోసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తేలింది. నిందితుల వద్ద నుండి మొత్తం రూ.3,50,000/- విలువ గల నకిలీ ₹500 నోట్లు, రూ.50,000/- అసలు నగదు మరియు 04 మొబైల్ ఫోన్లు స్వాధీనం పోలీసులు చేసుకోవడమైనది.

నిందితుల వివరాలుచిల్లరి సురేష్, 

.జల్లేపల్లి వెంకటేశ్వరరావు, 

 బండారి వంశీ, 

గాదె నాగరాజు,

నిందితులు తమ నేరాన్ని అంగీకరించగా, ఆయా దొంగతనాల కేసులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు నకిలీ కరెన్సీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద నోట్లు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ని లేదా 100 కి డయల్ చేయండి అని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, చంద్రుగొండ ఎస్సై శివరామకృష్ణ, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి, ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >