| Daily భారత్
Logo




శ్రీ భీమేశ్వరస్వామిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-02-15 17:26:23

Share: Share


శ్రీ భీమేశ్వరస్వామిని దర్శించుకున్న ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వైద్య శిబిరం, మే ఐ హెల్ప్ యూ డెస్క్ ల పరిశీలన.

క్యూ లైన్లలోని భక్తులతో మాట్లాడిన ఇంచార్జి కలెక్టర్..

డైలీ భారత్, వేములవాడ: మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేశారు. ఆలయం ఆవరణం వద్ద వైద్య శిబిరం, మే ఐ హెల్ప్ యూ డెస్క్ లను పరిశీలించారు. వైద్య శిబిరంలో ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లో సిబ్బంది తో మాట్లాడారు. అనంతరం క్యూ లైన్ల వద్ద భక్తులతో మాట్లాడి.. ఇక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వాలంటీర్లు నీటిని పంపిణీ చేస్తుండగా, పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, హెల్ప్ డెస్క్ బాధ్యులకు పలు సూచనలు చేశారు.

కమాండ్ కంట్రోల్ రూం పరిశీలన

బీమేశ్వర సదన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే కలిసి పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక్కడ ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >