| Daily భారత్
Logo




కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు

News

Posted on 2026-02-15 20:20:58

Share: Share


కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల దృష్ట్యా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు

ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం

డైలీ భారత్, కరీంనగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రేపు (ఫిబ్రవరి 16న) జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (గతంలో సెక్షన్ 144) ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐ.పి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ముఖ్య నిబంధనలు:

నిషేధం: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడటం నిషేధం.

అమలు సమయం: ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 16 ఉదయం 06:00 గంటల నుండి ఫిబ్రవరి 17 ఉదయం 06:00 గంటల వరకు అమల్లో ఉంటాయి.

అనుమతులు: ఏదైనా చట్టబద్ధమైన సమావేశాలు నిర్వహించాలన్నా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి.

చర్యలు: ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

మినహాయింపులు:

ఈ ఉత్తర్వుల నుండి కింది వారికి మినహాయింపు ఉంటుంది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది మరియు హోంగార్డులు.

అంత్యక్రియల ఊరేగింపులు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.

వైద్య మరియు అత్యవసర సేవలు (Emergency Services).

సమర్థ అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందిన వ్యక్తులు/బృందాలు.

మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ కోరారు.


#karimnagar #karimnagarsmartcity #karimnagarsmartcityupdates

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >