Posted on 2026-02-21 07:56:40
డైలీ భారత్, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్,అధికారులను ఆదేశించారు.
పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన పిర్యాదులను శుక్రవారం సాయంత్రం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివశక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపేందుకు మునిసిపల్ శాఖ పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలను, పిర్యాదులను ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలిపారు ముఖ్యంగా చెత్తకుప్పలు, డ్రైనేజీ కాలువల మరమ్మతులు, రోడ్లపై గుంతలు, అనధికారిక భవన నిర్మాణాలు వంటి పిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణ వార్డులో కార్యదర్సుల హాజరు నమోదు, రికార్డులను పరిశీలించారు. కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. పురమిత్ర యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ. మధు, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
#MCT #PuraMithra #Tirupati #maud_municipal #cdma_municipal #smartcity #sanitation #NCBN #APCM
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >