Posted on 2026-02-22 12:17:41
నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య
భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35), జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రాజేశ్వరికి శరత్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలని రాజేశ్వరి, శరత్ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవపడింది. అతను నిద్రలోకి జారుకున్నాక, ప్రియుడు శరత్‌కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరూ కలిసి కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ మృతి చెందాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన రాజేశ్వరి, శుక్రవారం ఉదయం తన భర్త పలకడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరిని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >