| Daily భారత్
Logo




మాందాపూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

News

Posted on 2026-03-01 13:49:42

Share: Share


మాందాపూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

ఘనంగా ఆత్మీయ సమ్మేళనం 

స్నేహబంధాలు బలోపేతం 

డైలీ భారత్, కామారెడ్డి: బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఇంద్రప్రస్థ వెంచర్‌లో బిబిపేట మండలం మాందాపూర్ 2000–2001 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ బంధాన్ని సిల్వర్ జూబ్లీగా ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ వాతావరణంలో నిర్వహించిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహభరితంగా సాగింది.

పావు శతాబ్దం తర్వాత కలుసుకున్న సహాధ్యాయులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్ననాటి స్నేహాలు, గురువుల బోధనలు, ఆడిపాడిన క్షణాలను తలుచుకుంటూ నవ్వులు పూయించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ జీవిత ప్రయాణంలో స్నేహం ఎంత విలువైనదో వివరించారు.కార్యక్రమం సందర్భంగా పరస్పరం సన్మానాలు, స్మృతిచిహ్నాల అందజేత, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో ప్రతి ఐదేళ్లకోసారి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి స్నేహబంధాలను మరింత బలపరచాలని నిర్ణయించారు.స్నేహం అనే బంధం కాలాన్ని దాటిపోతుందని ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనం మరోసారి చాటి చెప్పింది.ఈ కార్యక్రమంలో అంకన్న గారి గంగాధర్ గౌడ్, చింతకుంట సుధాకర్ రెడ్డి, గజ్వేల్ విజయ్ కుమార్, యాచం సంతోష్ కుమార్, గజ్వేల్ ఉదయ భాస్కర్, గురజాల సంతోష్ కుమార్, అయిత భాస్కర్, గంగమని, స్రవంతి, రజిత, సరిత, పెద్ద ధనలక్ష్మి, చిన్న ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >