Posted on 2026-03-07 17:51:38
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీలో ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం బీరప్ప దేవాలయంలో కాలనీ ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలనీ ఎన్నికల షెడ్యూల్‌ను కమిటీ సభ్యులు ప్రకటించారు.
కమిటీ నిర్ణయం ప్రకారం నామినేషన్ దాఖలు తేదీ 15 మార్చి 2026 (ఆదివారం) గా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ 18 మార్చి 2026 (బుధవారం). కాలనీ ఎన్నికలు 22 మార్చి 2026 (ఆదివారం) జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్‌గా రూ.25,000గా నిర్ణయించారు.
అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి 15 రోజులలోపు కాలనీ కమిటీని పునర్వ్యవస్థీకరించాలి (రెన్యువల్ చేయాలి) అని సమావేశంలో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ ప్లాట్లు కలిగిన వారికి ఓటు హక్కు ఉండదని ఎన్నికల కమిటీ స్పష్టం చేసింది. కాలనీ అభివృద్ధి దృష్ట్యా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కాలనీ ఎలక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >