| Daily భారత్
Logo




సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

News

Posted on 2026-03-10 20:55:00

Share: Share


సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు  స్థితప్రజ్ఞ

​ఘనంగా జరిగిన సిపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశం

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని IMA హాల్ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో నిర్వహించిన "సిపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశం" జరిగింది.

​ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన TSCPSEU రాష్ట్ర అధ్యక్షులు జి. స్థితప్రజ్ఞ  మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ హాజరయ్యారు.

​రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, సిపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల సామాజిక భద్రత గాలిలో దీపంలా మారిందని ధ్వజమెత్తారు.

​ఉద్యోగుల కష్టార్జితాన్ని రిస్క్‌తో కూడిన షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టి, రిటైర్మెంట్ తర్వాత వారిని రోడ్డున పడేయడం దారుణమని మండిపడ్డారు.

సిపీఎస్ ఉద్యోగులందరు ఏకం కావాలని,

​సభ్యత్వ నమోదు ఆరంభించామన్నారు. జిల్లాలో ప్రతి సి.పి.ఎస్ ఉద్యోగి సంఘంలో సభ్యత్వం పొంది, వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ,

​ సిపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత అటు సర్వీస్ పెన్షన్ లేకపోవడం, ఇటు వైద్య సదుపాయం కోసం EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) వర్తించకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

​​అన్ని శాఖల ఉద్యోగుల మద్దతు:

ఈ సమావేశానికి జిల్లాలోని విద్య, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ తదితర అన్ని విభాగాలకు చెందిన వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు.అనంతరం జిల్లా

కమిటీ ను ఎన్నుకున్నారు. సిపీఎస్ రద్దు కోరుతూ అందరూ ముక్తకంఠంతో నినదించారు. 

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డా. బాబు మాట్లాడుతూ,

పాత పెన్షన్ సాధన కోసం చేసే ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు.

​ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నిసర్ ఆహ్మద్, రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >