Posted on 2026-03-12 13:10:02
రూ.15 వేల విలువైన నిషేధిత హుక్కా ఫ్లేవర్ ప్యాకెట్లు, హుక్కా వెపర్ స్వాధీనం.
వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసులు నమోదు.
డైలీ భారత్, సూర్యాపేట: ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా కె. నరసింహ ఐపిఎస్ హెచ్చరించారు.
నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణం మెయిన్ రోడ్ నందు గల ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణాల నందు హుక్కా అమ్మకాలు నిర్వహిస్తున్నారు అనే సమాచారంపై పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 15వేల రూపాయల విలువైన నిషేధిత హుక్కా ప్యాకెట్లు, హుక్కా వెపర్ లు దొరికనైనది అని ఎస్పి నరసింహ ఐపిఎస్ తెలిపినారు. దీనికి సంభందించి ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగినది అన్నారు. నిషేధిత హుక్కా వెపర్ సేవించడం వల్ల క్యాన్సర్ సంభంద వ్యాధులు వస్తాయి, ప్రజల ఆరోగ్యాలను హరించే ఇలాంటి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి హెచ్చరించారు, దీనిని సేవించడం వల్ల ఆరోగ్యాలు నాశనం అవుతాయని అన్నారు. యువత ఇలాంటి చెడు అలవాట్లకు లోనుకావొద్దు అని తెలిపారు. ఇలాంటి అమ్మకాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >