| Daily భారత్
Logo




"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

News

Posted on 2026-03-13 12:25:43

Share: Share


"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ఆధ్వర్యంలో వెంకట్రావు నగర్ లోని కార్మికుల కోసం మనోవికాస సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ నిర్వహించి కార్మికులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమని తెలిపారు.

 రోజువారీ జీవితంలో సరైన జీవన విధాన మార్పులు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు.

పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలని, శరీరానికి ఉపయోగపడే మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. 

సమయానికి భోజనం చేయడం, తగిన నిద్ర, ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం, ధ్యానం చేయడం వంటి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని తెలిపారు.

లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. 

కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవగలరని అన్నారు.

మానసిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సాధారణ వైద్య శాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, బూర శ్రీమతి, రాపెల్లి లత, పలువురు కార్మికులు పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ పై అవగాహన పొందారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >