| Daily భారత్
Logo




ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్

News

Posted on 2026-03-16 01:54:19

Share: Share


ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జనాభా లెక్కలు 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టవలసిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని సబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ ప్రారంభించారు 

ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చార్జ్ అధికారులు (తహసీల్దార్ & మున్సిపల్ కమినర్లు), అదనపు చార్జి అధికారులకు (mpdos & managers) లకు నిర్వహిస్తున్న (03) రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జన గణన, ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదుచేసి ఇండ్ల జాబితా రూపొందిస్తారని తెలిపారు. 

ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గణన ప్రక్రియ ను నిర్వహిస్తారని, తమ యొక్క మండల పరిధికి చార్జ్ అధికారులుగా తహసిల్దార్లు, అదనపు చార్జ్ అధికారులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వ్యవహరిస్తారని అదేవిధంగా తమ యొక్క మున్సిపల్ పరిధికి  చార్గ్  అధికారులుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ మరియు అదనపు ఛార్జ్ అధికారులుగా మేనేజర్లు వ్యవహరిస్తారని తెలిపారు సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, మాస్టర్ ట్రైనర్లు వివరించే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యచరణ ప్రకారం జాబితా రూపొందించాలని తెలిపారు. 

15, 16, 17 రోజులలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశాన్ని నేర్చుకుంటూ ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సిపిఓ సౌమ్య, జెడ్పి సీఈవో కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, ఆర్డీవోలు తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >