Posted on 2026-03-16 17:06:23
శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేధింపుల వల్లే పదో తరగతి విద్యార్థి నితీష్ ఆత్మహత్య
వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన భారతీయ గోర్ బంజారా పోరాట సమితి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక పదో తరగతి విద్యార్థి అప్పం నితీష్ (16) ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి (B.G.P.S.) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ బల్బులు పగులగొట్టాడనే సాకుతో నితీష్‌ను ఒక బ్రాంచ్ నుండి మరో బ్రాంచ్‌కు మార్చారని, అక్కడ ఉపాధ్యాయులు నిరంతరం మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లే ఆ బాలుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఒక పేద విద్యార్థి ప్రాణం బలి కావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత ఉపాధ్యాయులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి.మృతుని కుటుంబానికి ప్రభుత్వం మరియు పాఠశాల యాజమాన్యం నుండి తగిన ఆర్థిక పరిహారం అందేలా చూడాలి.జిల్లాలోని కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపై జరుగుతున్న మానసిక వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ సమితి తరపున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల అధ్యక్షుడు రమేష్ నాయక్ రామదాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >