| Daily భారత్
Logo




వారపు వడ్డీ విషవలయం నుండి సామాన్యులకు విముక్తి

News

Posted on 2026-03-17 18:16:31

Share: Share


వారపు వడ్డీ విషవలయం నుండి సామాన్యులకు విముక్తి

వడ్డీ ముఠా గుట్టురట్టు చేసిన కామారెడ్డి పోలీసులు

డైలీ భారత్, కామారెడ్డి:ప్రతీరోజు సూర్యుడు ఉదయించడం లోకానికి వెలుగును పంచడానికే కావచ్చు.. కానీ అప్పులు చేసిన పిదవారికి మాత్రం మరొక రోజు వడ్డీ పెరిగింది అనే భయం కోసమే. ఆపద సమయంలో చేబదులు అడిగితే, "మేమున్నాం" అని కొండంత అండగా కనిపించే వడ్డీ వ్యాపారులు, తీరా సమయం గడిచేకొద్దీ నోరు తెరిచిన బకాసురుల్లా మారిపోతున్నారు. సామాన్యుడికి ఉన్న అత్యవసరాన్ని, అతడు ఇంకెక్కడికీ వెళ్లలేడనే నిస్సహాయతను ఒక "అలుసుగా" తీసుకుని, వారి రెక్కల కష్టాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్.. ప్రతీ రోజు రాత్రి, పగలు తేడాలేకుండా ఎండనక, వాననక కష్టపడితే వచ్చే ఆ నాలుగు వందల రూపాయల కోసమే అతని ఆరాటం. కానీ, ఆ సంపాదన ఇంటికి చేరకముందే రోడు మీద పొంచి ఉంటాడో "వడ్డీ బకాసురుడు" "వారం తిరిగింది.. వడ్డీ ఏది?" అంటూ గర్జించే ఆ గొంతు వింటేనే ఆ పేదవాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. సహాయం పేరుతో మొదలయ్యే ఈ బంధం, చివరకు ప్రాణాలు తీసే మృత్యుపాశంలా మారుతోంది.

ముఖ్యంగా ఈ వారపు వడ్డీల విషవలయం సామాన్యుడి రక్తాన్ని జుర్రుకుంటోంది. వారం తిరగకముందే అసలు కంటే ఎక్కువ వడ్డీని గుంజుతూ అమాయక ప్రజల జీవితాలను వీరు చిన్నాభిన్నం చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి టౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. బ్యాంకుల వద్ద మాటు వేసి, అత్యవసరంగా లోన్లు కావాల్సిన ఆటో డ్రైవర్లు, రైతులు మరియు నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని, అప్పులు ఇస్తామంటూ ఆశ చూపి, ముందస్తుగానే వడ్డీ పేరుతో నగదు వసూలు చేస్తూ ఈ గ్యాంగ్ వంచనలకు పాల్పడుతోంది. కేవలం కామారెడ్డిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లోనూ వేళ్లూనుకున్న ఈ ముఠా నుండి వందలాది ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, వేలిముద్రల పత్రాలు మరియు బంగారాన్ని అంతేకాకుండా వారు ఉపయోగిస్తున్న ఒక నంబర్ ప్లేట్ లేని ఒక వాహనం పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముఖ్యంగా సత్తి సాయిరామ్. తలారి రాజు వంటి నిందితులు బాధితులను వారం వారం అసలుతో సహా కట్టాలని బెదిరిస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో పోలీసులు పకడ్బందీగా దాడి చేసి వారిని కటకటాల్లోకి నెట్టారు.


అయితే, "అన్యాయం ఎంతో కాలం సాగదు" అని నిన్నటి పోలీసుల చర్య నిరూపించింది. బాధితుడు ధైర్యంగా ముందుకు వచ్చి కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల ఆట కట్టించారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలు ఊచల వెనక్కి నెట్టడమే కాకుండా, వారి వద్ద బందీలుగా ఉన్న వందలాది ప్రామిసరీ నోట్లు, చెక్కులు, నగదు మరియు బంగారం, వాహనం స్వాధీనం చేసుకున్నారు. చట్టం ఎవరినీ వదలదని పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయిస్తే, ఇలాంటి అరాచక శక్తుల పీడ వదిలించడం సాధ్యమేనని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >