| Daily భారత్
Logo




కార్పొరేషన్ టెండర్ల గందరగోళానికి కారణం ఎవరు

News

Posted on 2026-03-19 11:50:00

Share: Share


కార్పొరేషన్ టెండర్ల గందరగోళానికి కారణం ఎవరు

 కలెక్టర్ సమక్షంలో టెండర్లు తీయాలి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం సుజాతనగర్ పాల్వంచ వేరువేరు సెక్టార్లుగా చూడకుండా ఒకే టెండర్ విధానాన్ని పాటించాలి  

జలాల్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి 

సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పట్టణ పరిధిలోని పలు రకాల టెండర్ల విషయంలో గందరగోళం నెలకొనడానికి గల కారణం ఎవరో అని ఆవాజ్ పట్టణ కార్యదర్శి సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్ ప్రశ్నించారు. కార్పొరేషన్ హోదా వచ్చినప్పటికీ యావత్ 60 డివిజన్లకు సంబంధించిన ఎలాంటి పనులైన టెండర్ ఒకటే వేయడం వల్ల కార్పొరేషన్ కి లాభం వస్తుందని కానీ కొత్తగూడెం వేరు పాల్వంచ వేరు సుజాతనగర్ వేరు సెక్టార్లుగా చూస్తూ టెండర్లు పిలవడం భవిష్యత్తుకు నష్ట ధారయకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం సంత, డైలీ మార్కెట్, కబేలా టెండర్లలో కూడా జరుగుతుండడం బాధాకరమని ఆయన తెలిపారు. టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఎందుకు వ్యవహరించారో ఎందుకు గందరగోళ్లపడి తలబడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. టెండర్లు కొంతమందికి కేటాయించి మరల ఘర్షణ తర్వాత టెండర్లు రద్దయ్యాయి అధికారం మాకు ఉంది అంటూ అధికారులు చెబుతుండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టెండర్లు ఎవరేసినా మాకు అభ్యంతరం లేదని అధికారులు పాలకవర్గం నిబంధనలు పాటించి కార్పొరేషన్ కు నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న టెండర్ ప్రక్రియలో కలెక్టర్ సమక్షంలో టెండర్లు వచ్చినవారికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ కి టెండర్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి నష్టం వచ్చిన కచ్చితంగా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >