Posted on 2026-03-19 18:50:54
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరుకున్నారు. ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండటం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రైతులకు ఆధునిక సాంకేతికత, నీటి వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వివరించారు. పంటల ఉత్పాదకత పెంపుతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కొత్త సంవత్సరంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందిస్తూ అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఉగాది పర్వదినం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >