Posted on 2026-03-20 12:13:29
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా, మాచారెడ్డీ మండలం, గజ్యా నాయక్ తండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదనమైన లక్ష్మి, కర్రెపు నర్సవ్వ వీరిద్దరి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశము జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు నర్సింగ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి, అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గజ్యా నాయక్ తండాలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఎల్లంపేటలో గ్రామ ప్రజలతో ఉగాది ఉత్సవాలలో పాల్గొని, అలాగే సేవాలాల్, జగదాంబ దేవి, హనుమాన్ ఆలయ పూజా కార్యక్రమంలో పాల్గొని, తిరిగి ప్రయాణమయ్యారు.
ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ వినోద ప్రభాకర్, ఉప సర్పంచ్ భిక్షపతి, పార్టీ ప్రెసిడెంట్ బన్సీ నాయక్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త అరవింద్, మాచారేడ్డి సర్పంచ్ సంతోష్, భవానిపేట మాజీ సర్పంచ్ మద్దేల రాజు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >