Posted on 2026-03-20 15:44:04
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తూ ‘జీరో మొబైల్ జోన్’ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి గురువారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు కేవలం విద్యార్థులకే కాకుండా ఇన్విజిలేటర్లు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్స్ తీసుకెళ్లరాదని ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాలో పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నాపత్రం ఫోన్ ద్వారా బయటకు రావడం తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఈ కొత్త నియమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ విధుల్లో చేరే ముందు తమ వద్ద ఎలాంటి ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డే-వైజ్ డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది.
సంతకం చేసినప్పటికీ సిబ్బంది వద్ద ఫోన్లు ఉన్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తిస్తే, దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోన్లను వినియోగిస్తే 1997 తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదనంగా సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
సిబ్బంది చేసిన తప్పులకు చీఫ్ సూపరింటెండెంట్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై శుక్రవారం ఎగ్జామినేషన్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >