Posted on 2026-03-20 15:50:56
ఐస్‌క్రీం బండ్లకు గూడూరులో నో-ఎంట్రీ… అతిగా తినే పిల్లల ఆరోగ్యమే కారణం
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: యువత, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం గూడూరు గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గూడూరులోకి ఐస్‌క్రీం బండ్లు రాకుండా నిషేధం విధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు; ఉల్లంఘిస్తే ₹5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.గ్రామ పెద్దలు ముందుగా అక్రమ మద్యం బెల్ట్ దుకాణాన్ని మూసివేయగా, తర్వాత ఐస్‌క్రీం బండ్లపై దృష్టి సారించారు. కొందరు విక్రేతలు బండ్లలో మద్యం మిక్స్ చేసి అమ్మిన ఘటనలు, అలాగే సొంతంగా తయారుచేసిన ఐస్‌క్రీంలో కల్తీ పదార్థాలపై అనుమానాలు ఈ చర్యకు దారితీశాయి. “పిల్లలు అతిగా తిని దంత, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఏ రసాయనాలు కలుస్తున్నాయో తెలియదు” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, గ్రామం మొత్తం ఈ నిషేధాన్ని మూడు రోజుల క్రితం అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >