| Daily భారత్
Logo




యువజన రంగానికి అన్యాయం చేసిన తెలంగాణ బడ్జెట్

News

Posted on 2026-03-20 18:37:00

Share: Share


యువజన రంగానికి అన్యాయం చేసిన తెలంగాణ బడ్జెట్

నిరుద్యోగ యువతకు న్యాయం ఎక్కడ?

AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ లో యువజన రంగానికి  తీవ్రమైన అన్యాయం జరిగిందని, యువతపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈ బడ్జెట్ ను  పూర్తిగా యువత విస్మరించారని విమర్శించారు

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్య పూర్తిచేసిన యువతలో ఉన్న ఆందోళనలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. యువజనానికి జీరో ప్రాధాన్యం – బడ్జెట్‌కు జీరో న్యాయం చేశారని ఏద్దేవా చేశారు. లక్షలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలపై స్పష్టత లేదని, నిరుద్యోగ భృతి పై ఒక్క మాట లేదని, కాంట్రాక్ట్ ఉద్యోగాలతో యువత భవిష్యత్తు నాశనం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు ఉన్నా అవకాశాలు లేవని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అంటూ పరిమిత స్థాయిలో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని దీనిలో యువత భాగస్వామ్యం పూర్తిగా లేదని వారు ఆరోపించారు.రాజీవ్ యువ వికాశ పథకం అధికార పార్టీ కార్యకర్తల పథకమని వారు విమర్శించారు.అదే విధంగా క్రీడా రంగానికి కేటాయింపులు పరిమితంగా ఉండడం వల్ల గ్రామీణ యువతకు అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. గ్రామ స్థాయిలో క్రీడా మైదానాల కొరత, పేద క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం, వ్యాపార క్రీడలకు ప్రాధాన్యం పెరగడం ఇవన్నీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు.

జాబ్ క్యాలెండర్ పై స్పష్టత లేదని, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం అత్యంత కీలకమైనదన్నారు. చదువు పూర్తిచేసుకున్న లక్షలాది యువత ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. అయితే నియామకాలలో ఆలస్యం, స్పష్టతలేమి, వాయిదాలు యువతలో నిరాశను పెంచుతున్నాయని . ఈ పరిస్థితిలో ప్రభుత్వం బడ్జెట్ లో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. జాబ్ క్యాలెండర్ అంటే ఒక సంవత్సరంలో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనే పూర్తి సమాచారాన్ని ముందుగానే ప్రకటించడం. ఇది యువతకు దిశానిర్దేశం చేసే మార్గదర్శక పథకంలాంటిది.గత ప్రభుత్వం లాగే ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవహారిస్తున్నదని  ఈ బడ్జెట్ తీవ్ర నిరాశజనకమని విమర్శించారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >