| Daily భారత్
Logo




పెండింగ్ DA,PRC ల ఊసే లేదు

News

Posted on 2026-03-20 19:36:56

Share: Share


పెండింగ్ DA,PRC ల ఊసే లేదు

విద్యారంగానికి బడ్జెట్ లో కనీసం 15% కేటాయింపులు జరపాలి

పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ

డైలీ భారత్, కామారెడ్డి: 2026-27ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు  26,674 కోట్లు,గత సంవత్సరం కంటే అదనంగా 3566 కోట్లు అదనంగా విద్యకు కేటాయించినప్పటికీ, విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా ప్రస్తుత బడ్జెట్లో విద్యకు కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించడం సరైనది కాదు. అదేవిధంగా ఈ బడ్జెట్లో పిఆర్సి ప్రస్తావన ఉంటుంది, దానికి నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది

ప్రభుత్వం ఏర్పాటయ్యాక  ఆరు నెలలలోపు పిఆర్సిని అమలు చేస్తామని చెప్పి 27 నెలలు అవుతున్నా గానీ, పిఆర్సికి సంబంధించిన కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్లో కనపడకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశకు గురి చేసింది

వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేయడాన్నీ స్వాగతిస్తున్నాం.ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 1056 కోట్ల కేటాయింపును స్వాగతిస్తూ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు,పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డుల పై నగదురహిత వైద్యము అందించాలి

కొత్త పేర్లతో పాఠశాలను స్థాపించకుండా ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేసి నిధులు కేటాయించినట్టయితే విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రస్తుత బడ్జెట్లో కనీసం 15% తగ్గకుండా నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పాటుపడలని కోరుతున్నాం.

*అంబీర్ మనోహర్ రావు, జిల్లా అధ్యక్షులు, జనపాల లక్ష్మీరాజం,జిల్లా ప్రధాన కార్యదర్శి, పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >