| Daily భారత్
Logo




కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

News

Posted on 2026-03-21 12:31:03

Share: Share


కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 18వ తేదీన చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్.. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో ఉరివేసుకున్నాడు.

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా.. చంద్రశేఖర్‌ టూటౌన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు.

చంద్రశేఖర్‌ రోజుమాదిరిగా మంగళవారం ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగింది. విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పింది. సమాచారం తెలిసిన భర్త దివ్యను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కాగా, దివ్య మృతికి చంద్రశేఖర్ కారణమని.. ఆమె అంత్యక్రియల సందర్భంగా ఎస్సైపై సీతంపేట గ్రామస్తులు దాడి చేశారు. ఆ సమయంలో ఆ దాడిని దివ్య తండ్రి అడ్డుకోవడం గమనార్హం.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >