| Daily భారత్
Logo




నేటి తరానికి స్ఫూర్తిని అందించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్

News

Posted on 2026-03-23 18:29:57

Share: Share


నేటి తరానికి స్ఫూర్తిని అందించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

డైలీ భారత్, వైరా: నేటి తరానికి స్ఫూర్తిని అందించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ అని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడిపూడి భవనంలో జరిగిన కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నాటి భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు వేసి భారత స్వాతంత్రం కోసం నవ యవ్వన వయస్సులో ఉరితాడుకు పెనవేసుకుపోయిన భగత్ సింగ్ జీవితం తరతరాలకు ఆదర్శం అని అన్నారు. నేడు అమెరికా సామ్రాజ్యవాదం అహంకారంతో  ఇరాన్ పై దాడులు చేస్తుందని అన్నారు. ప్రపంచ సంపద, ఆయిల్ పై ఆధిపత్యం, అక్రమ సంపాదన కోసం ప్రపంచ దేశాలను ఆక్రమించుకొని ఆధిపత్యాన్ని చలాయించాలని అమెరికా యుద్ధాలు చేస్తున్నదని విమర్శించారు. అయినా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పక పోవడం దుర్మార్గమన్నారు. దీనిని భారత ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు అర్థం చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాన్ని తీవ్రంగా ఖండించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంకర సుధాకర్, పట్టణ నాయకులు కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, మల్లెంపాటి రామారావు, పానుగంటి రాంబాబు, యనమద్ది రామకృష్ణ, మాడపాటి మల్లికార్జున్ రావు, బెజవాడ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >