| Daily భారత్
Logo




రాష్ట్ర బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టు కు అవసరమైన నిధులు కేటాయించాలి

News

Posted on 2026-03-23 17:26:34

Share: Share


రాష్ట్ర బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టు కు అవసరమైన నిధులు కేటాయించాలి

రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ  నిరసన 

డైలీ భారత్, కామేపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఏడు లక్షల ఎకరాల కు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధుల్లో 2026-27  ఆర్థిక బడ్జెట్ లో కేటాయించాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి అని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ రైతులు భారీ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ రంగం కు నిధులు కేటాయింపులు తక్కువ చేయుడం, సీతారామ ప్రాజెక్టు కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం దారుణం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు 11 వేల కోట్ల రూపాయలు అంచనా వేసి రాష్ట్ర బడ్జెట్లో మాత్రం గత సంవత్సరం కేటాయింపులు 699 కోట్ల రూపాయల ఉంటే ఈ బడ్జెట్లో కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రభుత్వం కు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుంది అని అన్నారు, వ్యవసాయ రంగం కు కూడా గత బడ్జెట్ కంటే నిధులు కేటాయింపులు తక్కువ చేశారు అని బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు కేటాయింపులు పెంచాలి అని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్ రెడ్డి బాదావత్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు, నిర్వాసితుల సంఘం నాయకులు షేక్ షరిఫ్,, అర్జ రమేష్,, గడ్డం వీరన్న, వెంకట్రామిరెడ్డి, ఉపేందర్ రెడ్డి , సింగం వెంకన్న,, బాలాజీ, , వెంకటేశ్వరరావు,సేటియా నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >