Posted on 2026-03-23 18:37:20
పేద పిల్లలకు పౌష్టికాహారం దూరం చేయకండి
విద్యా, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ప్రభుత్వ వైద్యను నిర్వీర్యం చేసే కుట్రను అర్థం చేసుకోవాలి.
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, వైరా మండల కార్యదర్శి బాణాల వెంకట్రావమ్మ.
డైలీ భారత్, వైరా: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రజలందరూ ఖండించాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, మండల అధ్యక్షురాలు బాణాల వెంకట్రావమ్మ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) వైరా మండలం కమిటీ ఆధ్వర్యంలో వైరా మండలం విప్పలమడక గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఐద్వా విప్పలమడక గ్రామ అధ్యక్షురాలుగా సత్తెనపల్లి మాధవి, కార్యదర్శిగా ముత్తమాల కుమారి, ఉపాధ్యక్షురాలుగా మార్కాపురం కళావతి, సహాయ కార్యదర్శులుగా గరిడేపల్లి రామలక్ష్మి ముత్తమాల సంపూర్ణ, ముత్తమాల మాధవి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత, బాణాల వెంకట్రావమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూలీ పనులు చేసుకుంటూ అర్ధాకలితో జీవించే పేద కుటుంబాల పిల్లలు చదువు కుంటున్నారని, పేద విద్యార్థుల చదువులపై విషం చిమ్ముతూ మనువాద భావజాలాన్ని గరికపాటి నరసింహారావు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బడుల్లో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైందని, భోజనంలో గుడ్డెట్టారా.. గాడిద గుడ్డెట్టారా.. అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంది? చదివితే చదువుకోవాలి? లేకపోతే వెళ్ళిపొమ్మని గరికపాటి వ్యాఖ్యానించడం వేనుక పేద విద్యార్థులు చదువులు మానేసి కుల వృత్తులు చేసుకోవాలె మనువాదుల ఆలోచన ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫాం ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా..? శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు ! పేద విద్యార్థులకు ఇన్ని సౌకర్యాలా అంటూ గరికపాటి వ్యాఖ్యానించడం వెనుక ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేయాలనే ప్రయత్నం దాగి ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్ధాకలితో జీవించే పేద పిల్లలు చదువుతున్నారని, నేడు పౌష్టికాహార లోపంతో ఎంతోమంది చిన్నారులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాల కోసం పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యా, పౌష్టికాహారాన్ని దూరం చేసే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటందని, దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ విద్యా, పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. గరికపాటి నరసింహారావు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి సుజాత, రుద్రాక్షుల ఉమ, గరిడేపల్లి తులిసమ్మ గరిడేపల్లి కావేరి, గరిడేపల్లి భారతి, గరిడేపల్లి రామలక్ష్మి, గరిడేపల్లి మాధవి, గరిడేపల్లి అలివేలు, గరిడేపల్లి ఝాన్సీ, గరిడేపల్లి రాంబాయి గరిడేపల్లి నాగమణి, గరిడేపల్లి కుమారి తదితరులు పాల్గొన్నారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >