| Daily భారత్
Logo




శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం : సీపీ సజ్జనార్

News

Posted on 2026-03-23 18:43:31

Share: Share


శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం : సీపీ సజ్జనార్

డైలీ భారత్, హైదరాబాద్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు. నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు.

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..

"శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వహించాం. 16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థవంతగా, విజయవంతంగా జరుగుతుంది. ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం. శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు.. వాటిని పరిశీలిస్తాం" అని ఆయన వెల్లడించారు.

"అలానే ప్రభుత్వ, పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటారు. చైన్ స్నాచింగ్, ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను, షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తాము . ఈ యాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘాని కొనసాగిస్తాం. గతేడాది వెహికల్ బ్రేక్‌డౌన్ కారణంగా శోభాయాత్ర నెమ్మదించింది. ఈసారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం" అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు..

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >