| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

News

Posted on 2026-03-23 20:55:16

Share: Share


మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను మాజీ మంత్రి  సత్యవతి రాథోడ్  మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో నెలకొన్న ప్రస్తుత ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులు బయోమెట్రిక్ నమోదు మరియు ఫోటో తీసుకునే ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ఎస్సారెస్పీ (SRSP) నీటి విడుదలను వేగవంతం చేసి, రైతుల పంటలకు సమయానుకూలంగా నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు., తన మంత్రిత్వ కాలంలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు మరియు సంబంధిత వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు.జిల్లాలో ఉన్న భూ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న రైతుల పేర్లకు భూములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మన్యు ప్యాట్నీ, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, బాధే నాగయ్య, భద్రు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >