| Daily భారత్
Logo




టాస్క పోరాట ఫలితమే తల్లి దండ్రులకు భరోసా చట్టం

News

Posted on 2026-03-24 20:06:29

Share: Share


టాస్క పోరాట ఫలితమే తల్లి దండ్రులకు భరోసా చట్టం

టాస్క రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్             

ముఖ్య మంత్రి చిత్ర పటానికి సీనియర్ సిటిజెన్ల పాలాభిషేకం

డైలీ భారత్, కోరుట్ల: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కార్యవర్గాలు రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితమే మంత్రి వర్గం ఆమోదం తెలిపిన తల్లి దండ్రులకు సర్కారు భరోసా చట్టం అని టాస్క రాష్ట్ర కార్యదర్శి,  జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటి అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ -2026 బిల్లును మంత్రి వర్గం ఆమోదించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి జిల్లా, డివిజన్, మండలాల సీనియర్ సిటిజెన్స్ సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. 

టాస్క జిల్లా కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ బిల్లు పరిధిలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను తీసుకు రావడం టాస్క తరపున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రములోని దాదాపు 10.50 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈ చట్టం పరిధిలోకి వస్తారని, తల్లి దండ్రులకు కుమారుడు లేకపోతే ఉద్యోగం చేస్తున్న కూతుర్లు వారిని పోషించాల్సి ఉంటుందని, కొడుకు మరణిస్తే ఉద్యోగి అయిన కోడలు పోషించాలని, కోడలు ఉద్యోగి కాని పక్షంలో  కొడుకుకు వచ్చే పెన్షన్ నుంచి అత్తా మామలకు కొంత ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా స్థాయిలో  కలెక్టర్  దీనిని అమలు చేస్తారని, అక్కడ న్యాయం జరుగక పొతే రాష్ట్ర స్థాయిలో కమిషన్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తమ టాస్క తరపున ముఖ్య మంత్రి ని కోరుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథమ్, రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ ఆర్ దేశాయ్, పి. సి. హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పూసాల అశోక్ రావ్, ఆర్గనైజ్ కార్యదర్షులు సత్యనారాయణ, ఎం. డి. యాకూబ్, జిల్లా ప్రతినిధులు కరుణ,ఎం. డి. ఇక్బల్, సయ్యద్ యూసుఫ్, నారాయణ, బ్రహ్మయ్య, డివిజన్ ప్రతినిధులు పబ్బా శివానందం, వొజ్జల బుచ్చి రెడ్డి, పట్టణ ప్రతినిధులు సింగం గంగాధర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >