| Daily భారత్
Logo




న్యాయవాదుల రక్షణకు మరింత కఠినతరంగా ప్రత్యేక చట్టం : తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు

News

Posted on 2026-03-30 17:33:00

Share: Share


న్యాయవాదుల రక్షణకు మరింత కఠినతరంగా ప్రత్యేక చట్టం : తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు హర్షం వ్యక్తం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.

న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన  ప్రభుత్వం, ఈరోజు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్,స్రవంతి,వోద్యారపుస్వప్న, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >