Posted on 2026-04-01 15:22:44
తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మరావుపేట గ్రామంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు,యువజన సంఘాల సహకారంతో నిర్వహించిన రక్తదాన శిఖరం విజయవంతం కావడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు తెలియజేశారు.47 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాత సామల సంతోష్ రెడ్డి ని సన్మానించడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ లు,యువ పాలకవర్గం తలసేమియా వ్యాధి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కామారెడ్డి జిల్లాకే ఆదర్శంగా నిలవడం జరిగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ చిన్నారులకు ప్రతి 15 రోజులకు రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు.రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్ లు,టిఫిన్ బాక్స్ లను అందజేసిన దాతలు కమ్మరి ప్రవీణ్,దోమకొండ శ్రీనివాస్,మందుల రామచంద్రం లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకన్న,ఎల్లంకి సుదర్శన్,నంగునూరి కాశీనాథం గ్రామ యువత పాల్గొనడం జరిగింది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >