Posted on 2026-04-02 07:01:24
నిర్మాణ స్థానంలో ఇరు వర్గాల వాగ్వాదం
ఎస్ఐకి పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు
100 నెంబర్ కు డయల్ చేసిన బాధితులు
డైలీ భారత్, దోమకొండ : సుమారు కోటి రూపాయల విలువైన స్థలం కబ్జా విషయంలో కోర్టు అక్రమ నిర్మాణాలు ఆపివేయాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో దోమకొండలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దోమకొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1697 లో 9 గుంటల భూమి ఉంది. బుచ్చ మల్ల పోషవ్వ పేరిట ఉన్న భూమిని తప్పుడు నకిలీ పత్రాలతో ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో బాధితురాలు కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు.
కామారెడ్డి అడిషనల్ జూనియర్ మెజిస్ట్రేట్ దీక్ష అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని మూడు రోజుల క్రితం ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వివాదాస్పద స్థలంలో భూమిని తప్పుడు పత్రాలతో ఖరీదు చేసిన శరత్ కుమార్ పనులు జరుపుతుండడంతో బాధితుల తరఫున బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్రమ నిర్మాణం పనులు నిలిపివేయాలని నిరసన చేపట్టారు. పనులు కొనసాగడంతో బాధితులు 100 నెంబర్ డయల్ చేశారు.
దోమకొండ ఎస్సై ప్రభాకర్కు పంచాయతీ కార్యదర్శి యాదగిరికి మండల అభివృద్ధి అధికారి తహసీల్దారులకు కోర్టు ఆర్డర్లను బాధితులు అందజేశారు.
కామారెడ్డి ఆర్డీవో ఆదేశిస్తే అక్రమ నిర్మాణాలు ఆపివేస్తానని దోమకొండ పంచాయతీ సెక్రెటరీ యాదగిరి బాధితులకు స్పష్టం చేశారు.
బాధితులు గ్రామపంచాయతీ ముందు సర్పంచ్ ముందు తమ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మిస్తున్నారని ఆందోళన చేపట్టి నిరసన తెలియజేశారు.
దొంగ డాక్యుమెంట్లతో నిర్మాణం…? కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌ను పట్టించుకోరా?
దోమకొండ మండల కేంద్రంలో 9 గుంటల స్థలంపై వివాదాస్పద నిర్మాణం కొనసాగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కొత్తగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై బాధితులు కోర్టును ఆశ్రయించగా, 2026 మార్చి 25న కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ఆ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి యాదగిరిని సంప్రదించగా, “ఆర్డీవో కార్యాలయం నుంచి అధికారిక కాపీ అందిన తరువాత చర్యలు తీసుకుంటాం” అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణం కొనసాగడంపై అధికారుల నిర్లక్ష్యం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >