| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు

News

Posted on 2026-04-03 09:23:18

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు

నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్షలు తప్పదు,శిక్షలతోనే సమాజంలో మార్పు.

నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపిలను,కోర్ట్ కానిస్టేబుల్లను అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రుద్రంగి పోలీస్ స్టేషన్ లో నమోదైన వరకట్నం వేధింపు హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించినట్లు గురువారం రోజున సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ గారు తీర్పు వెల్లడించినట్లు  జిల్లా ఎస్పీ తెలిపారు.

వివరాల మేరకు 

రుద్రంగి గ్రామానికి చెందిన ఏనుగందుల రాజయ్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె హేమలత (పద్మ)ను అదే గ్రామానికి చెందిన సింగారపు జనార్ధన్‌కు కట్నాలు, కానుకలు ఇచ్చి వివాహం చేశారు. అయితే, వివాహం జరిగిన కొద్ది రోజుల తరువాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త సింగారపు జనార్ధన్, ఆడపడుచు సింగారపు శారద, మేనల్లుడు తెడ్డు సాగర్, అలాగే జనార్ధన్ అన్న కుమార్తె సింగారపు దివ్య కలిసి హేమలతను వేధించడం ప్రారంభించారు.

ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, ఇకపై హేమలతను బాగా చూసుకుంటానని జనార్ధన్ హామీ ఇచ్చి, ఆమెను తిరిగి తనతో కాపురానికి తీసుకెళ్లాడు.

తేదీ 3-4-2018 రోజున మళ్ళీ అదనపు వరకట్నం తీసుకొని రావాలని వేధించినడు,అట్టి విషయంలో  గొడవ జరుగగా పై నాలుగురు  కలిసి హేమలతను కొట్టి చంపాలనే ఉద్దేశంతో రోకలి బండతో తల పైన కొట్టి చంపినారు.

ఇట్టి కేసు లొ మృతురాలు యొక్క తమ్ముడు అయినా ఏనుగుందుల సతీష్ పిర్యాదు మేరకు అప్పటి రుద్రంగి ఎస్.ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసినారు, ఇట్టి కేసు లొ అప్పటి డిఎస్పీ  వెంకటరమణ కోర్ట్ లొ ఛార్జిషిట్ దాకాలు చేయగా, ఇట్టి కేసులో  ప్రాసిక్యూషన్ తరుపున పెంట శ్రీనివాస్ వాదించగా చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, CMS SI రవీందర్ నాయడు ఆధ్వర్యంలో కోర్ట్ మానిటీరింగ్  కానిస్టేబులు నవీన్, లతీఫ్ , శ్రీనివాస్ లు కోర్ట్ లో 19 మంది సాక్షులను ప్రవేశ పెట్టగా కేసు పూర్వ పరాలు పరిశీలిచిన తరువాత సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ గారు నిందుతులకు ఒక్కొక్కరికి  జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 2000/- రూపాయలు జరినామా విధించారు.

ఇట్టి కేసు లొ A4 అయినట్టు వంటి సింగరపు దివ్య మైనర్ కావడం వలన ఆమె పైన కేసు ప్రస్తుతం జూవినల్ కోర్ట్ లో నడుస్తున్నది

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు పెంట శ్రీనివాస్, చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, CMS SI రవీందర్ నాయడు,కోర్ట్ మానిటీరింగ్  కానిస్టేబులు నవీన్, లతీఫ్ , శ్రీనివాస్ లు అప్పటి పోలీస్ అధికారులు ఎస్.ఐ మరియు డిఎస్పీ లను  జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >