| Daily భారత్
Logo




మహిళా ఖైదీతో ఏఎస్ఐ నీచమైన బేరం

News

Posted on 2026-04-04 08:36:14

Share: Share


మహిళా ఖైదీతో ఏఎస్ఐ నీచమైన బేరం

“నువ్వు చాలా బాగున్నావు, నీ కూతురు కూడా..”

మహిళా ఖైదీతో ఏఎస్ఐ నీచమైన బేరం;

డైలీ భారత్, అకోలా: మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో పోలీస్ శాఖను తలదించుకునేలా చేసిన ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షక భట నిలయంలోనే ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) భక్షకుడిలా ప్రవర్తించాడు. లాకప్‌లో ఉన్న ఒక మహిళా ఖైదీకి తన కూతురిని అప్పగిస్తే డబ్బులిస్తానంటూ ఒక నీచమైన ప్రతిపాదనను పెట్టాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీస్ విభాగంలో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఘటన అకోలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో మూడు రోజుల క్రితం జరిగింది. సుమారు ₹80 లక్షల మోసం కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసి లాకప్‌లో ఉంచారు. అక్కడ డ్యూటీలో ఉన్న 54 ఏళ్ల ఏఎస్ఐ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ మహిళతో మాట్లాడుతూ.. “నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూతురు కూడా కచ్చితంగా అందంగానే ఉంటుంది. ఆమెను నా దగ్గరికి పంపించు, అందుకు బదులుగా నీకు ₹10,000 ఇస్తాను” అని అసభ్యంగా ప్రేలాపనలు చేశాడు.

సదరు ఏఎస్ఐ పెట్టిన అవమానకరమైన ప్రతిపాదనకు లొంగిపోకుండా, ఆ మహిళా ఖైదీ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదును జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) తీవ్రంగా పరిగణించి, ఆ ఏఎస్ఐని తక్షణమే సస్పెండ్ (నెలవు నుంచి తొలగింపు) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మరియు పదవిని దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది. అయితే, సస్పెన్షన్ వార్త వినగానే ఆ ఏఎస్ఐ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. నిందితుడి గత రికార్డును పరిశీలించగా, 10 ఏళ్ల క్రితం కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని తేలింది.

ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. మహారాష్ట్ర పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరడంతో పాటు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసింది. విచారణ నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

లోకల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదే రోజు ASI ను అదుపులోకి తీసుకున్నారు

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >