Posted on 2026-04-04 08:08:38
ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం.
నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని,ఒక్క సీసీ కెమెరా100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు..
రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈసందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 24 కెమెరాలు ఏర్పాటు చేసిన మార్గం గోపిని జిల్లా ఎస్పీ, ప్రభుత్వ విప్ అభినందించారు.
అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ....
గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతోందన్నారు.నేరాలను ముందుగానే నివారించడంతో పాటు,కేసుల చేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు.ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడమే కాకుండా, జరిగిన ఘటనలపై వేగంగా దర్యాప్తు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.ప్రజల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు
మండల ప్రజల,ప్రయాణికుల సౌకర్యార్థం రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్‌ను ప్రారంభించారు.ఈబస్ స్టాండ్ ప్రారంభంతో మండలంలోని ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని,గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు పోలీస్ శాఖ సమర్థవంతమైన రక్షణా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్, సి.ఐ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్,ఎస్.ఐలు మోతిలాల్, రమేష్,సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ అభిలాష్,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >