| Daily భారత్
Logo




బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!!

News

Posted on 2026-04-04 07:32:56

Share: Share


బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!!

డైలీ భారత్, హైదరాబాద్: వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెట్టి, తద్వారా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.

సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు. 

తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతూ, సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే  సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు. 

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల  ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు. 

ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలి. 

వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి.

ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి.

ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. 


#CyberCrimeAwareness #WhatsAppFraud #StaySafe #CyberSecurity

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >