| Daily భారత్
Logo




కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ... కేసు ఛేదన...నిందితుడు అరెస్ట్, రిమాండ్‌

News

Posted on 2026-04-04 15:41:07

Share: Share


కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ... కేసు ఛేదన...నిందితుడు అరెస్ట్, రిమాండ్‌

బాధితుడి నుండి నగదు మరియు ఆన్‌లైన్ బదిలీ ద్వారా సొమ్ము దోపిడీ

నిందితుడి నుండి పల్సర్ బైక్, కత్తి మరియు నగదు స్వాధీనం

కేసును వేగంగా ఛేదించిన కామారెడ్డి పోలీస్ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ

వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పి బి చైతన్య రెడ్డి ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ పరిధిలో జరిగిన అర్ధరాత్రి దోపిడీ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ, రామారెడ్డి రోడ్ సమీపంలోని చర్చి వద్ద 01.04.2026 అర్ధరాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగింది.

తేదీ: 01.04.2026 నాడు అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు గోలీ సుధీష్ కుమార్ (19 సంవత్సరాలు), విద్యార్థి, తన స్నేహితుడిని వదిలి తిరిగి వెళ్తుండగా, ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి అతన్ని అడ్డగించి కత్తితో బెదిరించి రూ.2,000/- నగదు దోచుకున్నాడు. అదేవిధంగా ఫోన్ పే ద్వారా రూ.8,000/- బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ ఆదేశాల మేరకు, ASP బి. చైతన్య రెడ్డి కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు విచారణ ద్వారా నిందితుడిని గుర్తించారు.

ఈరోజు (04.04.2026) నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి గంజిలో నిందితుడిని పట్టుకొని విచారించగా, అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముందుగా ప్రణాళిక వేసుకుని అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు.

నిందితుడి వివరాలు: శివరాత్రి నవీన్ s/o బుజ్జయ్య, వయస్సు: 25 సం:,నివాసం: ఇంద్రానగర్ కాలనీ, కామారెడ్డి.

స్వాధీనం చేసిన వస్తువులు:  1.పల్సర్  2. స్టీల్ కత్తి 3. Realme మొబైల్ ఫోన్ 4. రూ.8,000/- నగదు

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ B. నరహరి , ASI రంగా రావు , PCs కమలాకర్, రాజు, సంపత్ లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ అభినందించారు

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >