Posted on 2026-04-04 20:23:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్పుల తండా గ్రామానికి చెందిన గుగులోత్ రాములు, మేకల కాపరి, తన మేక దొంగతనం జరిగిన విషయమై ఫిర్యాదు చేశాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సూచనలు మేరకు చంద్రుగొండ పోలీసులు “ఆన్ సైట్ ఎఫ్‌ఐఆర్” విధానాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారి స్వయంగా బాధితుని వద్దకు వెళ్లి, సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ చేసి బాధితునికి అందజేశారు.
ఫిర్యాదు ప్రకారం, రాత్రి సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైక్‌పై వచ్చి బాధితునికి చెందిన మేకను దొంగిలించి వెళ్లినట్లు తెలియజేశారు. బాధితుని వాంగ్మూలం స్వీకరించిన అనంతరం సంఘటన స్థలంలోనే కేసు నమోదు ప్రక్రియ పూర్తి చేసి, బాధితునికి FIR ప్రతిని అందించారు.
ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ FIR విధానాన్ని అమలు చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు మరియు పోలీస్ స్టేషన్‌కు స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రుగొండ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించే దిశగా కట్టుబడి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >