Posted on 2026-04-05 10:25:57
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు,జిల్లా రాష్ట్ర కమిటీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా TSUTF జిల్లా ఆఫీస్ బేరర్ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పాకాల శంకర్ గౌడ్ ప్రకటించారు.గత దశాబ్ద కాలంగా సంఘ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని,దాచురి రామిరెడ్డి,నాగటి నారాయణ లాంటి మహానాయకులను స్పూర్తిగా తీసుకొని సంఘ అభ్యున్నతికి, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని అన్నారు.కాని నేటి రాష్ట్ర,జిల్లా నాయకుల్లో సంఘ నిర్మాణం,నియమాల కంటే వ్యక్తిగత స్వార్థం,పదవీ కాంక్ష, కుల రాజకీయాలు పెరిగాయని,ఉపాధ్యాయుల సమస్యలను, సంక్షేమాన్ని పక్కన పెట్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సంఘం పనిచేస్తూ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు.తన భవిష్యత్ కార్యాచరణ ను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.గత దశాబ్ద కాలంగా చేసిన ఉద్యమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >