| Daily భారత్
Logo




" బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్"

News

Posted on 2026-04-07 09:38:49

Share: Share


" బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్"

ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ పిలుపు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి నగర్, సిరిసిల్లలో “మైండ్ కేర్ అవగాహన కార్యక్రమం” ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్  నిర్వహించారు. 

ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవన విధానం, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, సమయాభావం, డిజిటల్ ప్రభావం వంటి కారణాల వల్ల కుటుంబ సంబంధాలలో విభేదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న అపార్థాలు, ఇరువురి మధ్య  అహం వల్ల పెద్ద సమస్యలుగా మారుతున్నాయని అన్నారు.

మనస్సు విప్పి మాట్లాడుకుంటే విభేదాలు పోయి అన్యోన్యత పెరిగి కుటుంబ బంధాలు బలపడుతాయని తెలిపారు.

 కుటుంబ వివాదాల పరిష్కారం కోసం మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కార్మికులకు వివరించారు.

ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర కమ్యూనికేషన్ మెరుగుపడుతుందనీ, భావోద్వేగ నియంత్రణ పెరిగి కోపం, ఆవేశం తగ్గి సమస్యలను శాంతంగా పరిష్కరించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనీ అన్నారు

కుటుంబంలో ప్రేమ, గౌరవం, నమ్మకం పెరుగుతాయని తెలిపారు.

ప్రస్తుతం చాలా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో మూడవ వ్యక్తి అయిన సైకాలజిస్ట్ మార్గదర్శకత్వం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 

కుటుంబ సమస్యలను ఒంటరిగా భరించకుండా, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని సూచించారు.

మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను వివరిస్తూ, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలనీ అన్నారు.

మానసిక ప్రశాంతత ఉంటేనే కుటుంబ జీవితం సుఖంగా ఉంటుందనీ తెలిపారు.

కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. థ్రిఫ్ట్, నేతన్న బీమా పథకాల్లో ప్రతి కార్మికుడు చేరాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >