| Daily భారత్
Logo




ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం

News

Posted on 2026-04-07 14:50:09

Share: Share


ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం

గీతా జ్ఞానం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అవసరం

పాఠశాల స్థాయి నుండి గీతా జ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించాలి

డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో కల్కి ఆలయంలో భగవద్గీత పారాయణ మహా యజ్ఞంలో భాగంగా సంపూర్ణ భగవద్గీత 18 అధ్యాయనాలు,700 ల లను కంఠస్థం చేసి శ్రీ గీతా పరివార్  ఆధ్వర్యంలో నిర్వహించబడిన భగవద్గీత పోటీ పరీక్షల్లో బంగారు పతకాలు సాధించిన 13 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ భగవద్గీత జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమే అని మానవుడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం దీని ద్వారా లభిస్తుందని, ఉన్నత విలువలతో కూడుకున్న వ్యక్తుల నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీత పట్టణం చేయాలని అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో 13 మంది భగవద్గీత పరీక్షల్లో బంగారు పతకాలు సాధించడం దేశానికే గర్వకారణమని అన్నారు, ప్రతి పాఠశాలలో భగవద్గీత శ్లోకాలను విద్యార్థులకు నేర్పించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరారు.సన్మాన గ్రహీతలు డాక్టర్ రాధా విజయలక్ష్మి దేవరకొండ, నంగునూరు సులోచన,లీలావతి రాజు,అందె శ్రీదేవి,పడిగల రమాదేవి,దువ్వల మమత, దువ్వల కుశాల్,యేల్లంకి పల్లవి, దోమకొండ ప్రేమలత,పార్శి విజయ్,లాబిశెట్టి పద్మ,బార్ల రాధ, బార్ల ఆర్య లను పూలమాల శాలువా,ప్రశంస పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కొవూరి భూమేష్ రమ దంపతులకు ఐవిఎఫ్ తరఫున అభినందనలు తెలియజేశారు.

ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి దొంతి సుధాకర్,కస్వ వెంకన్న లు మాట్లాడుతూ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సామాజిక సేవతోనే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందని భావనను సమాజానికి అందజేస్తున్నామని వైశ్యులకే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ మహిళా విభాగం బుక్క రజని,చిలువేరి శ్రీదేవి,కస్వ లలిత,దొంతి అర్చన,శనిశెట్టి పద్మ శ్రీనివాస్,ఆధ్యాత్మిక విభాగం ఎల్లంకి సుదర్శన్,ఎర్రం విజయ్ కుమార్,నంగునూరి కాశీనాథం, యువజన విభాగం ఎర్రం ఈశ్వర్ ఐవిఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >