Posted on 2026-04-07 19:50:46
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. ఇప్పటికే పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లలో చిక్కుకుని జైలుపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచాల డిమాండ్‌ను ఆపడం లేదు. పని జరగాలంటే తప్పనిసరిగా లంచం ఇవ్వాలని బాధితులపై ఒత్తిడి తెస్తూ, ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని స్పష్టంగా చెప్పే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి అవినీతి పరులపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ ఏసీబీ ట్రాప్‌లో చిక్కి అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో విత్తన లైసెన్స్ మంజూరు చేయాలని ఓ బాధితుడు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ వద్దకు వచ్చాడు. లక్షన్నర రూపాయలు లంచంగా ఇస్తే కానీ పని జరగదని గోవర్ధన్ నిక్కచ్చిగా చెప్పాడు. అందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భాగంగా ముందుగా రూ.25 వేల లంచం ఇచ్చాడు. ఇంకా లక్ష రూపాయలు ఇచ్చేముందు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్–II యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈరోజు బాధితుడు దగ్గర్నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండ గా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. . ట్రాప్ అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో డాక్టర్ గోవర్ధన్ చేతివేళ్లు పాజిటివ్‌గా తేలినట్లు అధికా రులు వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా అవినీతి ఎదురైతే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >