Posted on 2026-04-08 13:23:47
డైలీ భారత్, కామారెడ్డి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, IDOC సమావేశ మందిరంలో సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని ఆయన అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, పోషకాహారం, టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా సురక్షిత మాతృత్వం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్ లో
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానికి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే తల్లి, శిశువు సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన పెంపొందించడం.
కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని, గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ మార్గాలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే సురక్షిత ప్రసవం కోసం ఆసుపత్రుల్లోనే ప్రసవం జరగాలని సూచించారు.
ఈ వర్క్‌షాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ సమాజంలో సురక్షిత మాతృత్వంపై అవగాహన పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో dmho రవీందర్, వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >