| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

News

Posted on 2026-04-09 17:19:40

Share: Share


కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

రూ. 29,500 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 1 బైక్, 1 కారు స్వాధీనం

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది

 జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బుర్గుల్ గ్రామ శివారులో అక్రమంగా జూదం (Gaming) ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సి.సి.ఎస్ (CCS) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుంది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమ జూదానికి పాల్పడుతున్న నలుగురు (04) వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి నగదుతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్నవి:

1.నగదు: రూ. 29,500/- , 2. మొబైల్ ఫోన్లు: 4, 3. వాహనాలు: 1 బైక్, 1 కారు

పట్టుబడిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం గాంధారి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు గాంధారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. జూదం అనేది వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను నాశనం చేసే ప్రమాదకర అలవాటు. జూదానికి బానిసైన వారు అప్పుల బారిన పడి, కుటుంబ కలహాలకు గురై, చివరకు తీవ్ర నిర్ణయాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

జూదంలో ఎవరూ గెలవరు – నష్టపోయేది భవిష్యత్తే. అందువల్ల ప్రజలు జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా 100 నంబర్‌కు తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా పోలీస్ శాఖ కోరుతోంది.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >