Posted on 2026-04-10 09:32:15
14 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి రిమాండ్
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (27), తండ్రి బాల నరసయ్య, 2007 సంవత్సరంలో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి (5 సంవత్సరాలు), నైపున్య (2 సంవత్సరాలు) ఉన్నారు.
2012 సంవత్సరంలో భాగ్యలక్ష్మి మూడవసారి గర్భవతిగా ఉన్న సమయంలో,మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త ఆంజనేయులు,అలాగే అత్తమామలు ఆమెను మానసికంగా,శారీరకంగా వేధించాగా,అట్టి వేధింపులను భరించలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.ఈఘటనపై 2012లో ఆంజనేయులుపై కేసు నమోదు చేయబడింది.
అప్పటి నుండి ఆంజనేయులు పరారీలో ఉండగా దీంతో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయగా జిల్లా టాస్క్ఫోర్స్, ముస్తాబాద్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలీసులకు ఎల్లవ్వ కృతజ్ఞతలు
భాగ్యలక్ష్మి తల్లి ఎల్లవ్వ తన కూతురు మరియు మనవరాళ్లను హత్య చేసిన అంజనేయులు ను పట్టుకోవడంలో 13 సంవత్సరాల నుండి న్యాయం కోసం తిరుగుతున్నానని జిల్లా ఎస్పీ కి ఈ నెల 6 వతేదీన పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్పీ గారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం మూడు రోజుల్లోనే నిందితుడు అంజనేయులను అరెస్ట్ చేయడం పట్ల బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా వేగంగా ముందడుగు పడింది.ఈసందర్భంగా ఎల్లవ్వ జిల్లా పోలీసుల తక్షణ స్పందనకు,నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి కృషి చేసిన ప్రత్యేక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్, ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్, టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >