| Daily భారత్
Logo




ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

News

Posted on 2026-04-13 12:39:23

Share: Share


ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

డైలీ భారత్, గంభీరావుపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేట ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి అధ్యక్షతన ఐక్యుఎసి ఆధ్వర్యంలో వెబినార్ ఎఫ్ డి పి (ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ఎన్హాన్షింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ యూజింగ్ ఏఐ అనే అంశం పైన ఐపిఈ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్) హైదరాబాద్ తో కుదుర్చుకున్న కొలబరేషన్ లో భాగంగా ఈరోజు ఐపిఈ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసమూర్తి మరియు  రామకృష్ణ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ ముఖ్య వక్తగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు టీచింగ్ నైపుణ్యాలను ఎలా సులభతరంగా బోధించవచ్చునని రకరకాల ఉదాహరణలతో సుమారు 100 మంది పైన ఆన్లైన్లో హాజరైన వారికి వివరించారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ ఏ ఐ అనేది మన నిత్యజీవితంలో అత్యంత శక్తివంతమైనదనీ, అభివృద్ధి పథాన పయనించవచ్చుననీ, అభివర్ణిస్తూ రాబోవు కాలాన్ని శాసించే విధంగా పోటీ ప్రపంచంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ లోకమంతా ఏఐ పైన అవగాహన కలిగి ఉండాలని ఆశించారు. 

ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా కృషి చేసినందుకు  డాక్టర్ వై. ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ &ఐక్యూఏసి కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి గారికి ముఖ్య వ్యక్తులకు ఐపిఈ మేనేజ్మెంట్ కి ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్. ప్రభాకర్ వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు వి. వాణి, పి. ధర్మపురి, ఎ. మనోహర్, శ్రీనివాస్, భిక్మ్మయ్య, మరియు తదితర అధ్యాపక, అధ్యాపకేతర బ్బృందం విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >