Posted on 2026-04-14 15:45:28
డైలీ భారత్, కామరెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి డిజిపి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గౌరవ వందనం సమర్పించారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >