Posted on 2026-04-14 15:05:16
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా టి. వేణుమాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ పదవిలో కొనసాగుతున్న బి. బిక్షపతి ములుగు జిల్లా ఎస్‌ఈగా బదిలీ కావడంతో, వారి స్థానంలో వేణుమాధవ్ ను నియమించారు.వేణుమాధవ్ ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండగా, సిరిసిల్లకు బదిలీపై వచ్చారు. గతంలో జనగామ జిల్లాల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా సేవలందించారు.జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వేణుమాధవ్ తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >