| Daily భారత్
Logo




తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం

News

Posted on 2026-04-17 06:45:59

Share: Share


తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని అన్ని విశ్వవిద్యాల యాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా చెందిన మహమ్మద్ ఘాజిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యునిగా నియమిస్తూ జీవో విడుదలైంది. ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మహమ్మద్ ఘాజి స్పష్టం చేశారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >