Posted on 2026-04-17 12:06:21
డైలీ భారత్, చంద్రంపేట: ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయుల అపరిష్క్రత న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజున చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు కైరి పద్మ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన్నీరు పద్మజ ఆధ్వర్యంలో నల్ల రిబ్బను దరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని తక్షణమే డీఏ బకాయిలు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండి కొప్పుల రవి మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ కార్డులు , పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వడ్యారపు మధుసుధన్, పీ.అనిల్ , వేముల అంజలి, ముంజ రమ, వెంగల పల్లవి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >