Posted on 2026-04-18 05:38:38
పోలీసు అధికారులను ఆహ్వానించిన కమిటీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి, సమ్మేళనం కమిటీ సభ్యులు మరింత కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిసి, సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఏర్పాట్లు మరియు ప్రజల పాల్గొనిక గురించి వివరించారు.
కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, హిందూ సమాజంలో ఐక్యత, ధర్మ పరిరక్షణ, సాంప్రదాయ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి కార్యక్రమం గురించి తెలుసుకుని, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు పి. వీరవర్ధనరావు, కార్యదర్శి లట్టి జగన్ మోహన్, సభ్యులు యెల్దండి పూర్ణచందర్ రావు, వెంకట్ రెడ్డి, రాజేశ్వరరావు, మరియు న్యాయవాది పాతూరి పాండురంగ విటల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >